Telangana Assembly elections 2023 : ఓటు వేయని స్టార్స్ వీళ్ళే… సమాజానికి ఏం సందేశం ఇద్దామని?

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నవంబర్ 30న జరిగిన విషయం తెలిసిందే. సామాన్య ప్రజలతో పాటు చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినిమా షూటింగ్ లను సైతం పక్కన పెట్టి ఉదయాన్నే కుటుంబాలతో కలిసి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి, ఓటు వేసి వెళ్లారు. అయితే కొంతమంది కుర్ర హీరోలు మాత్రం ఈసారి ఓటు వేయడానికి అంతగా ఆసక్తిని కనబరచలేదు. ఆ లిస్టులో అక్కినేని అఖిల్, వరుణ్ తేజ్, శర్వానంద్, విశ్వక్ సేన్, అల్లరి నరేష్, మంచు విష్ణు, మోహన్ బాబు, శివ బాలాజీ వంటి వారు ఉన్నారు.

మంచు విష్ణు, మోహన్ బాబు, శివ బాలాజీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉండడంతో వారికి ఓటు వేయడం కుదరలేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు ‘కన్నప్ప’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక మరో యంగ్ హీరో శర్వానంద్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్ కోసం లండన్ లో ఉన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కృతి సనన్ హీరోయిన్ గా ‘మనమే’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు శర్వానంద్. అందుకే ఆయనకు ఓటు వేయడం కుదరలేదు. అయితే అక్కినేని అఖిల్, అల్లరి నరేష్, వరుణ్ తేజ్, విశ్వక్సేన్ వీరంతా హైదరాబాదులోనే ఉన్నారు. మరి హైదరాబాదులో ఉండి కూడా ఈ యంగ్ హీరోలు ఎందుకు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా మోకాలు సర్జరీ కారణంగా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ఓటర్లు, పైకి లేవలేని వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి అలాంటప్పుడు ఈ యంగ్ హీరోలకు ఏమైంది? వారికి ఓటు హక్కు లేదా ఇక్కడ? లేదంటే ఇంకా ఏదైనా కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదులో కేవలం 40 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైన నేపథ్యంలో యువ హీరోలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ యంగ్ హీరోల ప్రభావం ఈ తరం యువతపై బాగానే ఉంది. వీళ్ళు ఓటు వేసి తమ అభిమానులను కూడా ఓటు వేయమని కోరితే, ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళే ఓటు వేయకుండా ఇలా ఎగ్గొడితే ఏమిటి అర్థం? అసలు ఈ కుర్ర హీరోలు సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు?

- Advertisement -

కాగా టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, అక్కినేని నాగచైతన్య, నాగార్జున, ఉపాసన, అల్లు అర్జున్, రాజమౌళి, బ్రహ్మానందం, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా, అభిమానులు కూడా తప్పకుండా ఓటు వేయాలని కోరారు. వీళ్లను చూసి నేర్చుకోండయ్యా ఓటు వేయని హీరోలు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు