Anr Family: అక్కినేని ఫ్యామిలీలో అన్నీ తానై నడిపిస్తున్న లేడి బాస్..!

సుప్రియ యార్లగడ్డ, సినీ అభిమానులకు ఈ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కింగ్ నాగార్జునకు మేనకోడలైన సుప్రియ గతంలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, గూఢచారి సినిమాల్లో నటించి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. చరణ్ రెడ్డితో వివాహమై విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉంటున్న సుప్రియకు హీరో అడివి శేష్ తో ప్రేమాయణం నడుపుతోందంటూ రూమర్స్ కూడా వినిపించాయి ఆ మధ్య. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుండి అంగీకారం లభించినట్టు కూడా గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ లేదు.

సుప్రియ అక్కినేని కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు తాను దగ్గరుండి మరీ చూసుకుంటారట. ఎంతలా అంటే అన్నపూర్ణ సంస్థ నుండి ఈమె అనుమతి లేనిదే ఏ చిన్న వ్యవహారం కూడా జరగదట. అక్కినేని నాగేశ్వరావు బతికుండగానే తన వారసులందరికి సమానంగా ఆస్తులు పంపకం చేశారట, అలా తన తల్లి ఆస్తులు సుప్రియ వాటాకు వచ్చాయట. ఇక అప్పటి నుండి అన్నపూర్ణ సంస్థ నుండి నాగార్జున మరియు ఇతర కుటుంబ సభ్యుల వ్యవహారాలలో సుప్రియ కీలకంగా ఉంటున్నారని టాక్.

సెలెబ్రిటీల కుటుంబాల్లో లేడీ బాస్ లు పెత్తనం చెలాయించటం అన్నది సాధారణం అయిపోయింది. నారా ఫ్యామిలిలో భువనేశ్వరి, బ్రాహ్మణి లాగా అక్కినేని ఫ్యామిలిలో సుప్రియ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నమాట. ఇది పక్కన పెడితే సుప్రియ శేష్ ల వ్యవహారం పై ఓ క్లారిటీ రావాలని అటు అక్కినేని అభిమానులు, ఇటు హీరో శేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు