Suhas : ఈ చిత్రం కోసం రెండు సార్లు గుండు చేయించుకున్నా !

Suhas : హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను హీరో అవుతాడని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. కానీ తన అద్భుతమైన నటనతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇతను ఏదైనా సినిమాలో నటిస్తున్నాడంటే చాలు ఆ సినిమా అద్భుతంగా ఉంటుంది అనేంతలా ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. ఇతను సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు.

ఇక తన నటనతో సినిమాలలో మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు కొట్టేసి ఆ తర్వాత హీరో స్థాయికి ఎదిగి “కలర్ ఫోటో” సినిమాతో మన అందరి ముందుకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాలో హీరోగా తన సత్తా చాటి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ సినిమా అనంతరం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్క సినిమాలో అద్భుతంగా నటిస్తూ ఎమోషనల్ టచ్ ఇస్తున్నాడు.

కొన్ని సినిమాలలో విలన్ గా నటించి…ఇటు “రైటర్ పద్మభూషణం” సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇక రీసెంట్ గా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” అనే సినిమాతో ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ చూసి ప్రతి ఒక్కరు కేవలం ఎంటర్టైన్ సినిమా మాత్రమే అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ, సిస్టర్ సెంటిమెంట్ తో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

- Advertisement -

సుహాస్ హీరోగా, దుష్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో సుహస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుహాస్ మాట్లాడుతూ…..’ఈ సినిమా కోసం రెండుసార్లు గుండు చేయించుకున్న. బ్యాండ్ వాయించడం కూడా నేర్చుకున్నాను. నాకు దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే ఇష్టం. ఆయన సినిమాలో ఆఫర్ వస్తే క్యారెక్టర్ ఏంటనేది చూడకుండా నటిస్తా’ అని చెప్పారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు