Hunt : అద్భుతం

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుతం గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంటే సుధీర్ బాబు అని చెప్పాలి. ఫలితంతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. తాజాగా సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ “హంట్”. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. శ్రీకాంత్, తమిళ్ హీరో భరత్ ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను గత బుధవారమే విడుదల చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో ఈ టీజర్ విడుదలని వాయిదా వేశారు. తాజాగా ” హంట్” టీజర్ మూవీ మేక‌ర్స్‌ విడుదల చేశారు. ఈ టీజ‌ర్‌లో సుధీర్ బాబు గ‌జిని త‌ర‌హాలో గ‌తం మ‌రిచిపోయిన‌ట్టు తెలుస్తోంది. సుధీర్ ఈ చిత్రంలో ద్విపాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. రెండు పాత్ర‌ల‌ను అర్జున్ A , అర్జున్ B గా అభివ‌ర్ణించారు.

అర్జున్ Aకి తెలిసిన మ‌నుషులు, ఇన్సిడెన్సెస్‌, ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఇవేవి అర్జున్ B కి తెలియ‌వు. కానీ అర్జున్ కి తెలిసిన లాంగ్వేజెస్‌, స్కిల్స్‌, పోలీస్ ట్రైనింగ్ వంటివి అన్ని అర్జున్ B కి కూడా ఉన్నాయి. ఈ చిత్రంలోని డైలాగ్‌లు సినిమాపై అంచనాను పెంచేశాయి. ఏ కేసును అయితే ఆ అర్జున్ సాల్వ్ చేయ‌లేక‌పోయాడో అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అంటూ శ్రీ‌కాంత్ ప‌లికిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. టీజ‌ర్‌తోనే చిత్ర బృందం ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన అంచ‌నాలు క్రియేట్ చేశారు. జిబ్రాన్ అందించిన నేప‌థ్య సంగీతం మంచి థ్రిల్ ఫీల్‌ని క‌లిగిస్తుంది. మ‌రోసారి సుధీర్ బాబు కంటెంట్ ఉన్న స‌బ్జెక్ట్‌తో రానున్న‌ట్టు టీజ‌ర్ ని బ‌ట్టి తెలుస్తోంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు