Simbu : కాస్త ఆలస్యం !

శింబు హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం వెందు త‌నింద‌దు కాడు ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 15న త‌మిళంలో విడుద‌ల‌వుతోంది. కానీ తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు పేరిట విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. చివ‌రి నిమిషంలో ఈ సినిమా విడుద‌ల తేదీని వాయిదా వేసుకున్నారు. ఇక విష‌యాన్ని శ్రీ స్ర‌వంతి మూవీస్ ట్వీట్ ద్వారా తెలిపింది. సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగా తెలుగులో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వెల్ల‌డించింది.
ఇక త‌మిళ వెర్ష‌న్ లో మాత్రం సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల‌వ్వ‌నుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా త‌మిళంలో ప్ర‌ద‌ర్శితం కానుంది. గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు ప్రేక్ష‌కులు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. శింబు స‌ర‌స‌న సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌గా న‌టించారు. మ‌న్మ‌థ‌, వ‌ల్ల‌భ సినిమాల‌తో తెలుగులో శింబు మంచి క్రేజ్‌నే తెచ్చుకున్నారు. ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా కోసం ఏకం 15 కిలోల బ‌రువు త‌గ్గాడంట శింబు.

గ‌తంలో శింబు న‌టించిన మానాడు చిత్రాన్ని ది లూప్ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. చివ‌రి నిమిషంలో షోల‌ను ర‌ద్దు చేశారు. ఆ త‌రువాత ఓటీటీలో విడుద‌ల చేశారు. ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ప్ర‌స్తుతం ది లైఫ్ ఆఫ్ ముత్తు విష‌యంలో కూడా అదేవిధంగా ఆల‌స్య‌మ‌వుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు