Shobu Yarlagadda’s tweet: ఆ హీరోకు తలపొగరు ఎక్కువైంది

Shobu Yarlagadda’s tweet

బాహుబలి సినిమాతో ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభు యార్లగడ్డ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. అయితే బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తరువాత మళ్ళీ ఆ రేంజ్ సినిమా తీద్దామని ఈయన గతంలో చాలా ప్రయత్నించిన అవేవి వర్క్ అవుట్ అవ్వలేదు. ఇండస్ట్రీలో మంచి టెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ కేటగిరిలో ఒకడిగా ఉన్న శోభు యార్లగడ్డ లేటెస్ట్ గా చేసిన ఒక ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

“సక్సెస్ ని తలకెక్కనివ్వకూడదు. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి! ఇటీవలే ఒక హిట్ అందుకున్న ఒక కొత్త నటుడు .ఒక కొత్త డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కనీస గౌరవం చూపలేదు. ఈ యాటిట్యూడ్ అతని కెరీర్‌ను బిల్డ్ చేయటంలో సహాయపడదని ఆ హీరో త్వరగానే గ్రహిస్తాడని నేను ఆశిస్తున్నాను” అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేయగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గత కొద్దీ రోజులుగా బేబీ సినిమా విషయంలో డైరెక్టర్ సాయి రాజేష్ కు హీరో విశ్వక్ సేన్ కు వివాదం నడుస్తున్న సమయంలో శోభు యార్లగడ్డ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఐతే ఈ విషయం వైరల్ అవుతోందని గ్రహించిన శోభు యార్లగడ్డ మళ్ళీ ఏమనుకున్నాడో ఏమోగానీ తన ట్వీట్ ను వెంటనే డిలీట్ చేసాడు.

- Advertisement -

కానీ అప్పటికే ఈ విషయం అందరికి తెలిసిపోవడంతో, ఇంతకు నిర్మాత శోభు యార్లగడ్డ ఎవరి గురించి ఈ ట్వీట్ చేసాడని ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అయితే చాలా మంది శోభు యార్లగడ్డ ట్వీట్ లో ఆటిట్యూడ్ అనే పదం వాడటంతో ఖచ్చితంగ ఆయన విశ్వక్ సేన్ గురించే అని ఉంటాడని అనుకుంటున్నారు. అయితే శోభు యార్లగడ్డ ట్వీట్ లో కొత్త నటుడు అని క్లియర్ గా మెన్షన్ చేయడంతో కాస్త కన్ఫ్యూజన్ మొదలైంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు