Trailer talk : సగిలేటి కథ సినిమా అసలు కథేంటి ?

Sagileti katha trailer talk

యంగ్ హీరో నవదీప్ సమర్పణలో వస్తోన్న లేటెస్ట్ చిత్రం సగిలేటి కథ ట్రైలర్ నిన్న (సోమవారం ) సాయంత్రం విడుదలైంది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సుపరిచితుడైన రవితేజ మహాదాస్యం ను హీరోగా పరిచయం చేస్తూ, రాజశేఖర్ సుడ్మూన్ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న సినిమాలకు భారీగా ప్రజాదరణ లభిస్తుండగా సగిలేటి కథ సినిమా కూడా అలాంటి ఒక గ్రామీణ నేపథ్యం రూపొందించబడిన సినిమానేనని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే రాయలసీమ బ్యాక్డ్రాప్ లో దాదాపు అందరు కొత్త వాళ్ళతో తీసిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలనే సూపర్ హిట్టైన బలగం సినిమాను గుర్తు చేస్తుంది.

రాయలసీమ లో జరిగే జాతర మరియు జంతు బలుల ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. షేడ్ స్టూడియోస్ బ్యానర్ పై అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ ఈ సినిమాను నిర్మించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరవాలేదనిపించేలా ఉన్నాయి. అందరు కొత్త వాళ్ళు అవడంతో విజువల్స్ అన్నీ షార్ట్ ఫిలిం తరహాలో ఉన్నాయి. రవితేజ మహాదాస్యం సరసన విషిక లక్ష్మణ్ హీరోయిన్ నటిస్తోంది. ఇక ట్రైలర్ లో ఉన్న సంభాషణలు కంప్లిట్ గా రాయలసీమ యాసలో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

- Advertisement -

డైరెక్టర్ రాజశేఖర్ సుడ్మూన్ సగిలేటి కథ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు మూలం సగిలేటి కథ అనే నవల అంటూ చెప్పుకొచ్చాడు. రుచికరమైన కోడిమాంసం తినాలనే వ్యామోహంతో ఈ సినిమా సాగుతుందని కానీ ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు సినిమాలో పొందుపరిచాం అంటూ ఆయన తెలిపారు. దాదాపు చిత్రకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఆయన మీడియాకు వివరించారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు