Shailesh Kaluna : బంపర్ ఆఫర్ కొట్టేసిన డైరెక్టర్

హిట్1, హిట్2 సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ శైలేష్ కొలను. విశ్వక్ సేన్ తో తెరకెక్కించిన హిట్ ది ఫస్ట్ కేస్ మంచి హిట్ గా నిలిచింది. అలాగే రీసెంట్ గా అడివి శేష్ తో తెరకెక్కించిన హిట్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అడివి శేష్, నాని తో తెరకెక్కించబోయే హిట్ 3పై ఇప్పటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ సినిమాలంటే ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంది. అయితే శైలేష్ కొలను హిట్ సినిమాలతో పాటు బయట మరి కొన్ని సినిమాలు చేయాలని చూస్తున్న సంగతి విధితమే.

అందు కోసం కొంత మంది హీరోలకు ఈయన కథలను కూడా వినిపించాడని కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో డైరెక్టర్ శైలేష్ కొలను గురించి ఒక ఆసక్తిరమైన వార్త వైరల్ అవుతుంది. అది ఏంటంటే విక్టరీ వెంకటేష్ తో శైలేష్ కొలను సినిమా చేయబోతున్నాడట. వీరి మధ్య ఇప్పటికే స్టోరీకి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని గుస గుసలు వినిపిస్తున్నాయి. అది విక్టరీ వెంకటేష్ కు 75వ సినిమాగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

అయితే వెంకటేష్ తో తెరకెక్కించబోయి సినిమాను హిట్ 3 కంటే ముందే ప్రారంభిస్తారా.. లేదా హిట్ 3 తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ సినిమా స్టోరీ వెంకటేష్ కు సరిపోయే విధంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే శైలేష్ కొలనుకు వెంకటేష్ వెంటనే ఓకే చెప్పాడని సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు