RRR : హాలీవుడ్ దిగ్గజ దర్శకుడి ప్రశంసలు

2022 లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా వేరే స్థాయికి తీసుకెళ్లిన సినిమా ”ఆర్.ఆర్.ఆర్”. ఎస్ .ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరి యాక్టింగ్, డ్యాన్స్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ నిలిచింది. దీంతో పాటు ఏం.ఏం.కీరవాణి అందించిన మ్యూజిక్ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంది.

ప్రత్యేకంగా.. నాటు నాటు సాంగ్ కి వచ్చిన క్రేజ్ అంత ఇంత కాదు, ఆ మ్యూజిక్, ఆ బీట్, తో పాటు రామ్ చరణ్, తారక్ చేసిన డాన్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది. విదేశాల్లో కూడా ఈ సాంగ్ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సినిమా రిలీజ్ కంటే ముందే ‘నాటు నాటు’ ప్రేక్షకులని ఆకట్టుకొని, సినిమా పై ఇంకా అంచనాలు పెంచింది.

కాగా, ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో వివిధ క్యాటగిరీస్ లో ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా ఈ సినిమాపై ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ కు వరుసగా అవార్డులు వస్తున్నాయి. ఇప్పటికే పలు అరుదైన అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లలో నాటు నాటు సాంగ్ ను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఎంపికైంది.

- Advertisement -

అలాగే బెస్ట్ మ్యూజిక్ కేటగిరి లోను లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుని సొంతం చేసుకుంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవానిని ఎంపిక చేసింది. ఈ అవార్డు ప్రధానోత్సవం జరగగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా, తాజాగా హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరున్ ఆర్ఆర్ఆర్ ను చూసి, రాజమౌళి, కీరవాణి ని అభినందించారు. ఈ విషయాన్ని రాజమౌళి, కీరవాణి తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.”ఆర్.ఆర్.ఆర్ సినిమాను చూశారు. ఆయనకు నచ్చడంతో, తన భార్యతో కూడా కలిసి చూశారు. రెండవ సరి చూసి, తమకు 10 నిముషాలు కేటాయించి సినిమాను అభినందించారంటే.. నమ్మలేకపోతున్నాను” అని రాజమౌళి ట్వీట్ చేయిగా , ”జేమ్స్ కామెరాన్ ఆర్.ఆర్.ఆర్ రెండు సార్లు చూసి నా వర్క్ ను అభినందించారు, చాలా సంతోషంగా ఉంది” అని కీరవాణి ట్వీట్ చేసారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు