Sree Vishnu : స్వాగ‌తం

సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో అన్న‌గానే కొంద‌రూ వాళ్లు ఎంట్రి ఇస్తుంటారు. మ‌రికొంద‌రూ పాత వాళ్లు న‌టించ‌డం మానేస్తుంటారు. ఇలా ర‌క‌ర‌కాలుగా జ‌రిగిపోతుంది. తాజాగా ఓ యువ‌నటి టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఆరంగేట్రం చేయ‌నుంది. ఇప్ప‌టికే ఆ న‌టి చిన్న చిన్న పాత్ర‌లు చేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ హీరోయిన్‌గా చేయ‌నుంది. ఆమె మ‌రెవ్వ‌రో కాదండోయ్ రెబా మోనికా.

మ‌ల‌యాళం లో ‘చిప్పి’ సినిమా ద్వారా చిన్న పాత్ర‌లో న‌టించింది రెబా మౌనిక. ఆ త‌రువాత కొన్ని సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆమెకు అవి అంత‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. కానీ త‌మిళ న‌టుడు విజ‌య్ న‌టించిన బిజిల్ సినిమాలో అనిత పాత్ర మాత్రం అంద‌రికీ గుర్తు ఉంటుంది. ఆ సినిమాలో ఫుట్ బాల్ ఛాంపియ‌న్‌గా అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన రెబా మోనిక మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌రువాత క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం చిత్రాల్లో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంది.

తాజాగా యంగ్ బ్యూటీ టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అవుతుంది. హాస్య మూవీస్ ఓ ట్వీట్ చేసింది. టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు శ్రీ‌విష్ణు స‌ర‌స‌న రెబా మోనిక ఓ సినిమాలో న‌టిస్తుందని, ప్ర‌తిభ వంతురాలు అయిన‌టువంటి యువ‌న‌టికి స్వాగ‌తం అంటూ ట్వీట్ చేశారు.  లో తెర‌కెక్కిస్తున్న ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అనిల్ సుంక‌ర స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గోపి సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ త‌న ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తుందో లేదో వేచి చూడాలి మ‌రీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు