Ranbir Kapoor : నా పక్కనుంటే చాలు

బాలీవుడ్ క్యూట్ కపుల్ అంటే గుర్తు వచ్చే వాళ్లలో రణ్ బీర్ – ఆలియా ఒకరు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ బాలీవుడ్ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటైంది. పెళ్లికి ముందే రణ్ బీర్, ఆలియా కలిసి కమిట్ అయిన చిత్రం బ్రహ్మస్త్ర. భారీ అంచనాల నడుమ ఈ నెల 9వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో బ్రహ్మస్త్ర విడుదలైంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కరణ్ జోహర్, మరిజ్కె డిసౌజా, నమిత్ మల్హోత్రాతో పాటు మరి కొందరు కలిసి నిర్మించారు. అలాగే అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించారు.

అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చి, సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేశాడు. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర వ్యతిరేకతల మధ్య సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే మంచి విజయాన్ని దక్కించుకుంది. దీంతో మూవీ యూనిట్ మరింత ప్రమోషన్లు చేయడానికి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రణ్ బీర్ కపూర్ ఆసక్తిరమైన కామెంట్స్ చేశారు.

”నేను మొత్తం ఆలియా పైనే ఆధారపడి ఉన్నారు. ఆలియా ఎక్కడ ఉందో తెలియకపోతే బాత్రూమ్ కు కూడా వెళ్లలేను. అంతే కాదు.. తినలేను కూడా. ఆమె ఎల్లప్పుడు నా పక్కనే ఉండాలి అని అనుకుంటా. రొమాంటిక్ గా ఏమి చేయకపోయినా, నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. కానీ, ఆమె ఎప్పుడు నా పక్కనే ఉండాలి” అంటూ రణ్ బీర్ కపూర్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఆలియా-రణ్ బీర్ మధ్య ఎంత ప్రేమా ఉందో అర్థమవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు