టాలీవుడ్ రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు. దీంతో నిర్మాతలకు ఫుల్ ప్రాఫిట్స్. దీన్ని ఫలితాన్ని చూసి.. వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సాను కూడా రీ రిలీజ్ చేశారు. ఇది కూడా మంచి వసూళ్లు చేసింది. దీంతో టాప్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు
ఈ క్రమంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇటీవల హాలీవుడ్ లో అవతార్ సినిమాను కూడా రీ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లోకి కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రాబోతున్నారు. సురేష్ కృష్ణ, రజినీకాంత్ కాంబినేషన్ లో 2002లో వచ్చిన బాబా సినిమాను రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రజినీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ బాబా సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు.
Read More: Ranbir Kapoor: హీరోయిన్స్‌తో అలా చేసినా ఆలియా పట్టించుకోదు
అయితే రజినీ కాంత్ కెరీర్ లో అపజయం పాలైన లిస్ట్ లో బాబా ఒకటి. సూపర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది కానీ, ప్లాప్ అయిన సినిమాను రీ రిలీజ్ చేయడం వల్ల జోష్ ఉండదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది ఫ్యాన్స్ అయితే.. ఏ సినిమా అయినా సూపర్ స్టార్ మూవీ వస్తుందంటే ఆ కిక్కే వేరు అంటున్నారు.
Read More: Kangana Ranaut : ఆస్కార్ కు నామినేట్ చేయాలి
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...