Rajamouli : డబ్బు కోసమే సినిమాలు చేస్తా

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరుకు సినీ ప్రపంచానికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. రామ్ చరణ్, తారక్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం  ఆస్కార్ రేస్ లో ఉన్న సంగతి విధితమే. అలాగే అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ చిత్రం అవార్డులు అందుకుంటుంది.

కాగా ప్రస్తుతం జక్కన్న హలీవుడ్ లోనే ఉండి, ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డ్ కోసం ప్రమోషన్లు చేస్తున్నాడు. ఈ సందర్భంగా రాజమౌళి ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలా ఓ ఇంటర్వ్యూలో తన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సినిమాలు డబ్బు కోసమే చేస్తానని అన్నారు. అలాగే ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు తెరకెక్కిస్తానని తెలిపాడు. అంతే కానీ, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పుకొచ్చాడు. సినిమాలకు అవార్డులు అనేది అదనమని అన్నారు.

అలాగే తాను దర్శకత్వం వహించిన సినిమా కమర్షియల్ సక్సెస్ అయితే, ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. ఆర్ఆర్ఆర్ ఒక కమర్షియల్ సినిమా అని తెలిపాడు. ఇది కమర్షియల్ గా సక్సెస్ అయిందని చెప్పుకొచ్చాడు. ఒక సినిమా డబ్బులు వచ్చాయని, అలాగే అవార్డు వస్తే, తన కష్టానికి అదనపు ఫలితం అని డైరెక్టర్ రాజమౌళి తన సినిమాల గురించి వివరించాడు. కాగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవడానికి రోజు రోజుకు ముందడుగు వేస్తోంది. అంతర్జాతీయ సినీ క్రిటిక్స్ కూడా ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు