Rajamouli : గట్టెక్కించడమే లక్ష్యం

భారతీయ సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందో అందరికీ తెలుసు. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు ఉన్నా, థియేటర్ లలో ఎక్కువ రోజులు ఆడటం లేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోవడం లేదు. దీనిలో టాలీవుడ్ కాస్త మెరుగ్గా ఉన్నా, బాలీవుడ్ పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. హిందీ ప్రేక్షకులను మెప్పించే సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం హిందీ ప్రేక్షకులు సౌత్ సినిమాలనే చూస్తున్నారు. అయితేే బాలీవుడ్ కు హిట్ తీసుకురావడం బ్రహ్మాస్త్రం తోనే సాధ్యం అని సినీ విశ్లేషకులు చాలా బలంగా నమ్ముతున్నారు.

భారీ బడ్జెట్, అగ్ర నటీనటులు, హిందూ నేపథ్యం ఉండటంతో ఈ సినిమా బాలీవుడ్ కు ఊపిరిపోస్తుందని అనుకుంటున్నారు. ఈ సినిమా ఈ నెల 9న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. దీనికి ప్రమోషన్లు కూడా మేకర్స్ గట్టిగానే చేస్తున్నారు. సౌత్ లో ప్రేక్షకులను ఆకర్షించడానికి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, దర్శకధీరుడు రాజమౌళిని రంగంలోకి దించుతున్నారు. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తెలుగులో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. అలాగే తెలుగులో ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తున్నారు.

ఇదిలా ఉండగా రాజమౌళి తాజాగా బ్రహ్మస్త్రంను ప్రమోట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. డైరెక్టర్ అయాన్ తనకు బ్రహ్మస్త్రం కథను 2015లోనే చెప్పినట్టు తెలిపాడు. మన పురాణాలను అనుసరించి ఈ కథను తయారు చేయడం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. జీవానికి ఆధారం పంచ భూతాలు అని, వాటి నేపథ్యంలో ఐదు శక్తిమంతమైన అస్త్రాలు ఉంటాయని పురాణాల్లో ఉందని చెప్పాడు. ఒక్కో అస్త్రం ఎంత శక్తిమంతమైందో ఈ సినిమా ద్వారా తెలుస్తుందని తెలిపాడు.

- Advertisement -

అస్ట్రాలు, సూపర్ హీరోల గురించి వివరిస్తూనే.. సినిమాలో ప్రేమ గురించి కూడా డైరెక్టర్ అయాన్ బాగా చూపించాడని వివరించాడు. విజువల్ వండర్ గా వస్తున్న ఈ బ్రహ్మాస్త్రం ప్రతి ఒక ప్రేక్షకుడిని తప్పకుండా మెప్పిస్తుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. బ్రహ్మాస్త్రంను గట్టెక్కించడానికి రాజమౌళి బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రమోషన్ లలో భాగంగా సౌత్ లో కొన్ని నగరాలు తిరిగేసిన జక్కన్న, ఇప్పుడు ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాను సైతం వాడుతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు