Project K : హైదరాబాద్ లో ప్రాజెక్ట్ K

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. తెలుగు డైరెక్టర్ నాగ శౌర్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక బడ్జెట్ తో వస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ K ఒకటి. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తున్న ప్రాజెక్ట్ K పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించడంతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ప్రాజెక్ట్ K అనౌన్స్ మెంట్ 2020లోనే వచ్చింది. కానీ, కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది.

గత నెలలో హైదరాబాద్ లో రాయదుర్గ్ మెట్రో స్టేషన్‌లో అమితాబ్ బచ్చన్ పై ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారు. తాజా గా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, దీపికా పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. దీని కోసం కాస్ట్ అండ్ క్రూతో కలిపి వందల మంది షూటింగ్ లో పాల్గొంటున్నరని సమాచారం.

- Advertisement -

ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతంలో ప్రభాస్ తన లంబోర్గిని కారులో ప్రత్యేక్షమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు