Tollywood: సుజిత్- పవన్ సినిమా క్రేజి అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా సాహూ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.ఆర్ సినిమా నిర్మించిన డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. తాజా గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ షూటింగ్ జనవరి 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

పవన్ కళ్యాణ్ సినిమాలు ఇప్పటికే విడుదల అవ్వటానికి లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో చిత్రికరించబడుతున్న హరి హర వీర మల్లు షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా లో నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. అలాగే సోనాల్ చౌహన్ ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు షూటింగ్ బ్యాలన్స్ ఉంది అని సమాచారం.

సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహూ లో యాక్షన్ సీన్స్ చూస్తే, ఆ డైరెక్టర్ పవర్ స్టార్ కాంబినేషన్ లో ఇంకెంత పవర్ఫుల్ గ ఉండబోతుందో అనే ఆసక్తి పెరుగుతుంది. దానికి తోడు సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని గబ్బర్ సింగ్ సినిమా సక్సెస్ అయినప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచే చాలామంది అభిమానుల్లో సుజీత్ కూడా ఒకడు.

- Advertisement -

సాహో సినిమా సుజిత్ కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు పవర్ స్టార్ తో చేయబోయే సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు