Pawan kalyan : వీరమల్లుకే ప్రాధాన్యత

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ వైపు రాజకీయాల్లో రాణిస్తూనే మరో వైపు సినిమాల్లో రాణిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా చేశాడంటే చాలా మందికి లైఫ్ ఇస్తాడట. ఇటీవల విడుదలైన  పవన్  భీమ్లానాయక్ సినిమా ద్వారా మొగులయ్యతో ఓ పాట ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొగులయ్య ఏకంగా పద్మ శ్రీ అవార్డు అందుకోవడం విశేషం. 

మరో వైపు పవన్ కళ్యాణ్ తమిళ చిత్రం వినోధయ సీతమ్ తెలుగు రీమెక్ లో నటించనున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొననున్నాడనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తో పాటు మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇందులో కీ రోల్ పోషిస్తున్నాడట. ఇక ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నాడు.  ఇక పవన్ కళ్యాణ్ కి రీమెక్ లు కొత్తేమి కాదనే విషయం తెలిసిందే.

ఇప్పటికే హిందీలో తెరకెక్కించిన అమితాబ్ బచ్చన్ కీ రోల్  చేసిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ రీమేక్ నటించాడు.  ఈ సినిమా తెలుగులో  బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. మరోవైపు మలయాల సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమెక్ గా వచ్చిన భీమ్లనాయక్ కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉండగా ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా  హరిహర వీరమల్లు అనే సినిమాకి సంబంధించిన ట్రీజర్ విడుదల చేశారు. ఆ ట్రీజర్ కి సోషల్ మీడియాలో రెస్పాన్స్ మామూలుగా లేదు. తొలుత వినోధయ సీతమ్  సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ హరి హరవీరమల్లు టీజర్ రెస్పాన్స్ చూసి చిత్ర ఈ చిత్ర బృందం ఈ  సినిమాని త్వరగా విడుదల చేయాలని సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ వినోదయ సీతమ్ రీమెక్ వెనక్కి వెళ్లి హరి హర వీరమల్లు ముందుకు వచ్చిందని సోషల్ మీడియాలో తెగ చర్చించుకోవడం విశేషం. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు