Parineeti Chopra: పరిణితి చోప్రా పెళ్లి ఆ కండిషన్స్ పైన జరిగిందట..

Parineeti Chopra

బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా ల వివాహం ఇటీవలనే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా సెలెబ్రెటీల పెళ్లిలు జరిగితే ఆ పెళ్లి ఖర్చు, వధువరులు ధరించిన దుస్తువుల ఖరీదు, పెళ్లి భోజనాలకు సంబంధించిన ఖర్చు మరియు ఇతర విషయాలు పాపులర్ అవుతుంటాయి. కానీ పరిణితి చోప్రా పెళ్లి విషయంలో మాత్రం వీటన్నింటికి భిన్నంగా ఆమె పెళ్లికి రాఘవ్ చద్దా పేరెంట్స్ పెట్టిన కండిషన్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తే పరిణితి చోప్రా వివాహం అంత ఆశామాషిగా ఏమి జరగలేదనిపిస్తోంది. పరిణితి చోప్రా ప్రేమించిన రాఘవ్ చద్దా పొలిటీషియన్ అయిన కారణంగా అతని పేరెంట్స్ హీరోయిన్ గా కొనసాగుతున్న పరిణితి చోప్రా తో పెళ్ళికి మొదట అంగీకరించలేదట. కానీ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన రాఘవ్ చద్దా, పరిణితి చోప్రాల మనోభావాలను అర్థం చేసుకొని కొన్ని కండిషన్స్ తో వారు ఆ ఇద్దరి పెళ్లి కి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఆ కండిషన్ మరేంటో కాదు పెళ్లి తరువాత పరిణితి చోప్రా పూర్తిగా సినిమాలలో నటించకూడదని చెప్పారట.అయితే ఆ కండిషన్ కు పరిణితి చోప్రా అస్సలు అంగీకరించలేదట.

పరిణితి చోప్రా ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా దాదాపు చివరి దశలో ఉంది. అలాగే ఇటీవలనే మరో రెండు సినిమాలలో నటించడానికి ఆమె అగ్రిమెంట్ కూడా చేసుకుందట. ఇప్పటికిప్పుడు సినిమాలు చేయడం మానేస్తే లైన్ లో ఉన్న ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏమై పోతుందని ఆమె అత్తమామలను ప్రశ్నించిందట దాంతో వాళ్లు కూడా ఏకీభవించి ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు కంప్లిట్ చేసి, ఇకపై కొత్త సినిమాలేవీ కమిట్ అవ్వకుండా ఉండాలని చెప్పడం తో పరిణీతి ఓకే అనినిందట. ఇక దీన్ని బట్టి చూస్తే పరిణితి చోప్రా మరో ఏడాది పాటు మాత్రమే బాలీవుడ్ యాక్ట్రెస్ ఉండబోతుందని తెలుస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు