Parineeti Chopra Marriage: పెళ్ళికి స్పెషల్ కండిషన్స్ – సెలెబ్స్ ఒప్పుకుంటారా..?

Parineeti Chopra Marriage

హీరో, హీరోయిన్ల సినిమాల గురించి మాత్రమే కాదు, వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తి చూపుతుంటారు ఫ్యాన్స్. అలాంటిది వారి పెళ్లిళ్ల విషయంలో ఈ ఇంట్రస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే సెలెబ్రిటీల మ్యారేజెస్ కూడా కమర్షియల్ అయిపోతున్నాయి ఈ మధ్య.

సెలెబ్స్ మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోస్ కి కూడా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రమోషనల్ ఏజెన్సీస్ ఆ డిమాండ్ ని క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా పెళ్లి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. మరో 24గంటల్లో పరిణితి చోప్రా, రాఘవ్ చద్దాల పెళ్లి ఉన్న నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పరిణితి చోప్రా పెళ్ళికి అటెండ్ అయ్యే గెస్ట్స్ కి స్పెషల్ కండిషన్ పెట్టనున్నట్లు సమాచారం అందుతోంది. అదేంటంటే, పెళ్ళికి అటెండ్ గెస్టులు సెల్ ఫోన్ యూజ్ చేయకుండా వాళ్ల కెమెరాలకు బ్లూ టేప్ అతికించనున్నారట. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు లీక్ కాకుండా ఉండటం కోసమే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

టేప్ వేసినంత మాత్రాన దాన్ని తీయకుండా ఉండరు కదా అన్న అనుమానం ఈవెంట్ ఆర్గనైజర్లకి కూడా వచ్చింది కాబోలు, ఆ టేప్ ని తీసేస్తే కెమెరా మీద బాణం గుర్తు పడేలా డిజైన్ చేశారట. ఎవరైనా టేప్ తీసి ఫోటోలు తీసినా కూడా ఎగ్జిట్ సమయంలో ఆ బాణం గుర్తు ద్వారా వారిని గుర్తించి ఆ ఫాన్స్ నుండి ఫోటోలు డిలీట్ చేసేందుకు ప్లాన్ చేశారట. మరి, సినీ ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా పొలిటీషియన్స్ కూడా ఈ పెళ్ళికి అటెండ్ అవుతున్న నేపథ్యంలో ఈ కండిషన్ కి వారు ఎలా రియాక్ట్ అవుతారో అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు