Brahmanandam : పంచ‌తంత్రం అప్పుడేనా..?

టాలీవుడ్ క‌మెడీయ‌న్ అంటే ట‌క్కున గుర్తుకొచ్చే పేరు బ్ర‌హ్మానందం. చాలా సినిమాల్లో న‌టించిన బ్ర‌హ్మానందం ఈ మ‌ధ్య కాస్త గ్యాప్ పెరిగింద‌నే చెప్పాలి. బ్ర‌హ్మానందం, క‌ల‌ర్స్ స్వాతి, స‌ముద్ర‌ఖ‌ని, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ విజ‌య్‌, న‌రేష్ అగ‌స్త్య, దివ్య‌శ్రీ‌పాద త‌దిత‌రులు న‌టిస్తున్న చిత్రం పంచ‌తంత్రం. హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్ట‌రీ, ఎస్ ఒరిజిన‌ల్స్ బ్యాన‌ర్స్ పై అఖిలేష్ వ‌ర్ద‌న్, సృజ‌న్ ఎర‌బోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

డిసెంబ‌ర్ 09న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు వెల్ల‌డిస్తూ.. ఓ వీడియోని వ‌దిలారు. ఇక ఆ వీడియోలో బ్ర‌హ్మ‌నందం సీరియ‌స్‌గా, వ్యామోహంతో పంచ‌తంత్రం అనే ప‌దం రాసి ఉన్న క్యాసెట్‌ని చూస్తున్నాడు. రాహుల్ విజ‌య్ మాత్రం కాస్త ఆత్రుత‌తో గాలిలోకి చూస్తూ న‌డ‌వ‌డం క‌నిపిస్తోంది. హ్యాపీ మూడ్‌లో ఉన్న శివాత్మిక రాజ‌శేఖ‌ర్ రాహుల్ విజ‌య్‌కి జోడిగా న‌టించింది. సుముద్ర‌ఖ‌ని, దివ్య‌వాణి మ‌ధ్య వ‌య‌స్కులైన జంట‌గా క‌నిపిస్తున్నారు. మ‌రోవైపు దివ్య శ్రీ‌పాద త‌న భ‌ర్త‌తో క‌లిసి సంతోషంగా ఉన్న‌టువంటి దృశ్యాలు క‌నిపిస్తాయి. క‌ల‌ర్స్ స్వాతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఆమె మ‌రోసారి పంచ‌తంత్రం క్యాసెట్‌తో వృత్తాన్ని పూర్తి చేస్తోంది.

ప్ర‌ధానంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీలా క‌నిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా బ్ర‌హ్మ‌నందం వేద‌వ్యాస్ పాత్ర‌లో న‌టించారు. క‌ల‌ర్స్ స్వాతి, బ్ర‌హ్మ‌నందం మ‌ధ్య జ‌రిగే సన్నివేశాలు ఆక‌ట్టుకుంటాయ‌ని నిర్మాత‌లు పేర్కొంటున్నారు. ఈ ‘పంచ‌తంత్రం’ సినిమా క‌థ ఏంటో తెలియాలంటే మాత్రం డిసెంబ‌ర్ 09 వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు