Naga Chaitanya : ఆ అవకాశాన్ని వదులుకోను

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. టాలీవుడ్ లో చై కెరీర్ సక్సెస్ ఫుల్ గా ఉన్న సమయంలో లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. అయితే టాలీవుడ్ లో ఇటీవల వచ్చిన థాంక్యూ సినిమాతో పాటు బాలీవుడ్ లో తొలి సారి నటించిన లాల్ సింగ్ చడ్డా రెండు సినిమాలు నిరాశపరిచాయి. కానీ, లాల్ సింగ్ చడ్డాలో చైతన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు చైతన్య నటనపై ప్రశంసలు కురిపించారు.

దీంతో సినిమా విడుదల తర్వాత మునపటి కంటే ఎక్కువగా ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. తాజాగా ఒక టీవీ ఛానల్ తో జరిగిన చర్చ కార్యక్రమంలో నాగ చైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరోయిన్స్ తో నటించాల్సి వస్తే, ఎవరితో నటిస్తారు అనే ప్రశ్న వస్తే, దానికి సమాధానంగా.. ఆలియా భట్, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా అని చెప్పారు. వీటితో పాటు లిస్ట్ లో ఇంకా పేర్లు ఉన్నాయని తెలిపారు.

అయితే అందరి కంటే ముఖ్యంగా ఆలియా భట్ తో నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆలియా నటన అంటే తనకు చాలా ఇష్టమని, ఈ హీరోయిన్ తో నటించే అవకాశం వస్తే వదులుకోనని చెప్పుకొచ్చారు. అలాగే సెలబ్రెటీ క్రష్ ఎవరు అని అడగగా.. మాజీ ప్రపంచ సుందరి సుష్మితా సేన్ అని సమాధానం ఇచ్చారు. దీంతో పాటు ‘మనం’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాల్సి వస్తే తన పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది అని అడగగా.. వెంటనే రణ్ బీర్ అని చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు