Mrunal Thakur: రెమ్యునరేషన్ పై సీతా సంచలన వ్యాఖ్యలు

సీతారామం సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల మది దోచుకుంది మృనాల్ ఠాకూర్. సీతారామం సినిమా చూసిన ప్రేక్షకులు మృనాల్ నటనకు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలోని సీత పాత్రలో ఒదిగిపోయి సినీ ప్రేమికుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. సినిమా సినిమాకు తనదైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ కి బాగా దగ్గర అవుతుంది. మహారాష్ట్రలోని ధూలే ఏరియాలో పుట్టిన మృనాల్.. ముంబైలోనే తన స్కూలింగ్, కాలేజీ పూర్తి చేసింది. 2012లో “ముజ్ సె కుచ్ కేహేతి” అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. 2014లో విడుదలైన మరాఠీ చిత్రం విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం చేసింది మృనాల్.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృనాల్ హీరోయిన్స్ కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ కి సంబంధించి ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన చర్చలో మృనాల్ ఠాగూర్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “రెమ్యూనరేషన్ విషయంలో హీరోయిన్స్ నిక్కచ్చిగా వ్యవహరించాలి. ప్రేక్షకులలో మనకున్న ఇమేజ్ ని బట్టి ఎంత పారితోషికం ఇవ్వాలో నిర్ణయిస్తారు. చాలామంది హీరోయిన్స్ వారు కోరుకున్న పారితోషకాన్ని డిమాండ్ చేసే విషయంలో తెలియని అయోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. హీరోయిన్స్ వారికి రెమ్యూనరేషన్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో అర్థమవుతుంది” అని చెప్పింది మృనాల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు