ఈ శుక్రవారం రిలీజ్ అయిన విరాటపర్వం చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా విమర్శకులను ఈ చిత్రం బాగా మెప్పించింది. దర్శకుడు వేణు ఉడుగుల దర్శకుడిగానే కాకుండా రచయితగా కూడా మెప్పించింది. సినిమాలో హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలు కూడా ఎక్కుగానే ఉన్నాయి. వేణు టాలీవుడ్ కు మరో క్రిష్ లాంటి వాడు అనే ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు.
అయితే పెద్ద హీరోలు మాత్రం వేణు తో సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువగా లేవు. ఎందుకంటే వేణు విరాట పర్వం సినిమాను కమర్షియల్ మీటర్ లో తీయలేదు. ఇలాంటి సినిమాలు ఓటీటీకి బాగుంటాయి. కానీ రానా ఉన్నాడు కాబట్టి థియేటర్ కు ఇచ్చారేమో అని అందరికీ ఓ చిన్న డౌట్. అయతే, ఈ సినిమాకు కలెక్షన్లు ఏమాత్రం బాలేదు. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. నీదీ నాదీ ఒకే కథ చిత్రం శ్రీ విష్ణు మార్కెట్ కు సరిపడే సినిమా. కానీ విరాటపర్వం వంటి సినిమా రానా తో చేస్తున్నప్పుడు కొన్ని లెక్కలు ఉంటాయి. అది మ్యాచ్ చేయాల్సిన బాధ్యత దర్శకుడిగా వేణు పై ఉంది. ప్రస్తుతం మైత్రి, సితార వంటి బ్యానర్లలో వేణు సినిమాలు చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు. వాళ్ళతో చేసే సినిమాలతో ఏమైనా చేంజ్ చూపిస్తాడేమో చూడాలి.