Mahesh Babu : అదరగొడుతున్న కొత్త లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట హిట్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. తన తర్వాత సినిమా SSMB28 స్క్రిప్ట్ విషయంలో కొన్ని పనులు ఉండటంతో ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ను ప్రిన్స్ తన ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. విదేశాల్లోనే ఉంటూ కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. మహేష్ తన ఫ్యామిలీతో ప్రస్తుతం స్విజ్జర్లాండ్ లో ఉన్నాడు. గత ఆదివారం నమ్రత కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి స్విజ్జర్లాండ్ లో ఉన్నట్టు చెప్పింది.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలో మహేష్ కొత్త లుక్ లో ఉన్నారు. ఈ కొత్త లుక్ లో మహేష్ బాబు అదరగొడుతున్నారు. చిన్నగా గడ్డం, అంతే చిన్న మీసాలతో సూపర్ గా కనిపిస్తున్నాడు. తన కూతురు సితారతో స్విజ్జర్లాండ్ వీధుల్లో ఉన్నాడు అంటూ నమ్రత ఇన్ స్టాలో షేర్ చేసింది. కాగా, మహేష్ కొత్త లుక్ ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖూషిగా ఉన్నాడు.

ఈ లుక్ SSMB28 కోసమే అని అంటున్నారు. అలాగే 46 ఏళ్ల వయసు వచ్చినా యంగ్ గానే కనిపిస్తున్నాడు.. అందుకేనేమో మహేష్ బాబును ప్రిన్స్ అంటారు అని మరి కొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ట్విట్టర్ లో ఇండియాన్ జాన్ వీక్ అంటూ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు