Krishna : కన్నీరు పెట్టిస్తున్న మంజుల ఘట్టమనేని ట్వీట్

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు మరణించిన సంగతి తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో మరణించారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ అభిమానులు కూడా శోకసంద్రంలో ఉన్నారు. మంగళవారం రాత్రి నానక్ రామ్ గూడలోని సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో భౌతిక కాయాన్ని ఉంచారు.

తాజాగా ఈ రోజు ఉదయం పద్మాలయ స్టూడియోకి అభిమానుల సందర్శనార్థం తరలించారు. మధ్యాహ్మం 12 గంటల వరకు అక్కడే ఉండనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు మహా ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇది ఇలా ఉండగా, సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్ కన్నీరు పెట్టిస్తుంది.

ఈ ట్వీట్ లో.. ”ప్రియమైన నాన్న.. మీరు ఈ ప్రపంచానికే సూపర్ స్టార్. నాకు, మన ఇంట్లో కూడా మీరే సూపర్ స్టార్. మా కోసం మీరు చూపించిన ప్రేమ చిరకాలం మాతో ఉంటుంది. మీరు చిత్ర సీమకు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పటికే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. నాన్న ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తాను. ఐ లవ్ యూ నాన్న” అంటూ మంజుల ఘట్టమనేని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూసిన ఘట్టమనేని అభిమానులు స్టే స్ట్రాంగ్ మంజుల గారు, స్టే స్ట్రాంగ్ మహేష్ బాబు అంటూ రిప్లే ఇస్తున్నారు. అలాగే ఈ ట్వీట్ తో నాన్నపై మంజులకు ఉన్న ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు