Janhvi Kapoor: గ్లామర్ షోకు ప్రాధాన్యత ఉంటుందా ?

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవల తన కెరీర్ లో భారీ ప్రాజెక్ట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోనేషన్ లో NTR30 అనే సినిమా వస్తుంది. ఈ చిత్రం ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. కానీ, అనివార్య కారణాల షూటింగ్ తో పాటు పూజా కార్యక్రమాం కూడా వాయిదా పడుతుంది. అయితే ప్రస్తుతం NTR30 పట్టాలెక్కడానికి సిద్ధమవుతుంది.

ఆస్కార్ కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్, అక్కడి నుంచి వచ్చిన వెంటనే NTR30 పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రస్తుతం నందమూరి, జాన్వీ కపూర్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పటి వరకు జాన్వీ చేసిన సినిమాలు తక్కువే. కానీ, తన సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ తో లక్షల్లో అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే జాన్వీ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో నటనతో సమానంగా గ్లామర్ షోకి ప్రాధాన్యత ఇస్తుంది.

అయితే NTR30 దర్శకుడు కొరటాల శివ తన సినిమాల్లో హీరోయిన్లకు మంచి పాత్ర ఇస్తాడు. ఎలాంటి గ్లామర్ షోకి చోటు ఇవ్వకుండా.. మొదటి సినిమా మిర్చిలో అనుష్క శెట్టికి, తర్వాత శ్రీమంతుడులో శ్రుతి హాసన్ కు, జనతా గ్యారేజ్ లో సమంత, నిత్య మీనన్ కి, భరత్ అనే నేను లో కియారా అద్వానీ ఇలా కొరటాల చేసిన ప్రతి సినిమాలో హీరోయిన్లు గ్లామర్ షో కంటే.. నటనకు ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

మరి ఇప్పుడు NTR30లో జాన్వీ కపూర్ కి నటన ప్రాధాన్యత గల పాత్రను ఇస్తాడా ? లేదా జాన్వీ ఇప్పటి వరకు చేసిన గ్లామర్ షోకే పెద్ద పీట వేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు