Liger : పూరీ జాగ్రత్త పడ్డాడా ?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఈ క్రేజీ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లైగర్”. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీ రోల్ సినిమాకి మరింత క్రేజ్ ని తీసుకువచ్చింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన సినిమా పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం రెండు గంటల 20 నిమిషాల నిడివి ఉంది. బాక్సర్ పాత్రలో విజయ్ నటన అదిరిపోయిందని, ఇక అనన్య, రమ్యకృష్ణ తమ పాత్రల్లో జీవించేసినట్లు తెలుస్తోంది. చిత్రంలో మొత్తం ఆరు పాటలు, 6 ఫైట్లు ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు