Hi nanna : హాయ్ నాన్న సందడి మొదలవబోతుంది

Hi nanna

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా హాయ్ నాన్న సందడి మొదలవబోతుంది. గతకొద్ది రోజులుగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న హాయ్ నాన్న షూటింగ్ మొత్తానికి చివరి దశకు చేరుకుంది. దాంతో సినిమా ప్రమోషన్స్ కూడా వెంటనే స్టార్ట్ చేయబోతుంది మూవీ టీం.

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా మొదటి పాటకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రోమో ద్వారా మూవీ టీం ప్రకటించనుంది.

నాని, మృణాల్ ఠాకూర్, కియారా కన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు హేశం అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందించారు. ఇటీవలనే విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాకు తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకున్న హేశం మరోసారి హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబొతున్నడని చెప్పొచ్చు. ఇప్పటికే రిలీజైన హాయ్ నాన్న టీజర్ మ్యూజిక్ అందరిని ఆకట్టుకోవడంతో హాయ్ నాన్న సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి.

- Advertisement -

ఇక నాని నెక్స్ట్ సినిమాల విషయానికొస్తే హాయ్ నాన్న సినిమా తరువాత తమిళ్ డైరెక్టర్ సిబి చ‌క్ర‌వ‌ర్తి తో నాని సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా త్వరలోనే రాబోతుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు