AA22: రజినీకాంత్ తరువాత అల్లు అర్జునే – చీప్ దొబ్బింది భయ్యా నీకు

సూపర్ స్టార్ట్ రజనీకాంత్ కు ఇండియా వైడ్ ఎంత క్రేజ్ ఉందొ అందరికి తెలిసిందే. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాల పేరుతో దర్శకులు, నిర్మాతలు సినిమాల గ్రాండియర్ పెంచుతూ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ రజనీకాంత్ సినిమాలు కేవలం తమిళ్ మాత్రమే తీసేవాడు. ఆ సినిమాలే మిగితా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేవారు. కానీ ఆయన స్టైల్, ఆయనకున్న చరిష్మా, ఆఫ్ స్క్రీన్ లో ఆయన అందరితో నడుచునే విధానం ఆయనని ఈరోజు సూపర్ స్టార్ ను చేసింది. ఇక అంతటి పేరున్న వ్యక్తితో అల్లు అర్జున్ ను కంపేర్ చేసాడు ఒక గత టాలీవుడ్ హీరో.

ఆ హీరో ఎవరో కాదు శివాజీ. ఒకప్పుడు తెలుగులో మంచి సినిమాలు చేస్త్తూ బిజీగా ఉన్న ఈయన ఈ మధ్య కాలంలో సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు. మరీ ఈయన్నే ఇండస్ట్రీ దూరం పెట్టిందో లేక ఈ హీరోనే కావాలని దూరం అయ్యాడో ఆ రెండు కాక అవకాశాలు రావట్లేదో తెలీదు ప్రస్తుతం ఈయన సినిమాలు చేయడం లేదు. కానీ మధ్య మధ్యలో మీడియా ముందుకు మెరుపు తీగల వచ్చి, ఏవేవో సంచలన వ్యాఖ్యలు చేసి హడావిడి అయితే చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఈయన చేసిన కొన్ని కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఇటీవలనే ఒక ఇంటర్వ్యూ కు అటెండ్ అయిన హీరో శివాజీ యాంకర్ మీ ఫెవరెట్ హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు గాను తాను ఎప్పటికి చిరంజీవి అభిమాని అని చెబుతూనే ఈ జెనెరేషన్ లో తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని , తానే సౌత్ ఇండియా సూపర్ స్టార్ , రజనీకాంత్ తరువాత ఆ ప్లేస్అల్లు అర్జున్ కె సొంత అంటూ చెప్పడంతో ఈ కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ కు సపోర్ట్ చేస్తున్నారు. కాగా వేరే హీరోలా అభిమానులు మాత్రం నీకు చీప్ నిజంగానే దొబ్బింది భయ్యా అల్లు అర్జున్ కంటే స్టార్డం ఉన్న హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నీకు కనబడటం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు