Hari Hara Veera Mallu: ముందు మొదటిది అయితే రెండోది ఆలోచిద్దాం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. డిజాస్టర్ సినిమాతో కూడా కలెక్షన్స్ కొట్టగలిగే సామర్థ్యం ఉన్న హీరో. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ట్రాఫిక్ జాములు ఉండేవి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ఒప్పుకొని, అన్ని సినిమాలకు సైన్ చేసేసాడు. కానీ వాటిలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయిన సినిమాలు మాత్రమే పూర్తి చేసుకొని రిలీజ్ చేయగలిగాడు. ఇంకొన్ని సినిమాలు అలానే ఉన్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి.

అన్నిటికంటే ముందు రావాల్సిన ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రావాల్సిన ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమా నిర్మాత ఏం రత్నం కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా పవన్ కు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే ఈ ప్రాసెస్లో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయింది అంటూ కొంతమంది ఈ సినిమా గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

- Advertisement -

ఇక దీనిపై నిర్మాత ఏ ఏం రత్నం స్పందించారు. పవన్ కళ్యాణ్ కి ఏ ఏం రత్నం కి మంచి అనుబంధం ఉంది. వీళ్ళ కాంబినేషన్లో ఖుషి సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే ఖుషి అని కూడా చెప్పొచ్చు. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా గురించి ఏ ఏం రత్నం స్పందించారు.

ఏదో ఒక సినిమా చేసి డబ్బులు చేసుకోవాలనుకుంటే ఆయన డేట్స్ ఓ ఇరవై రోజులు తీసుకుని సినిమా చేసేసే వాడిని. కానీ ఆయనతో చేసే సినిమా గుర్తుండిపోవాలి. ఇండియా లెవెల్లో ఆయనేంటో తెలియాలి అనే స్థాయిలో చేస్తున్నాం. వైసీపీ మీడియా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం చేస్తోంది. దీనికి రెండో భాగం కూడా ఉంటుంది. అంటూ రత్నం చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సినిమా మొదటి ప్రాజెక్టు ఏ అయోమయంలో ఉంది. ఇంకా రెండువ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది అని చాలామంది పవన్ అభిమానులకి కొద్దిపాటి నిరాశ కూడా ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు