SPY: అప్ కమింగ్ పాన్ ఇండియా స్టార్ నిఖిల్ కి హ్యాపీ బర్త్ డే

నిఖిల్ సిద్ధార్థ్.. హ్యాపీ డేస్ లో సైడ్ హీరోగా కెరీర్ మొదలు పెట్టి యువత చిత్రంతో మెయిన్ హీరోగా మారి, స్వామి రారా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తికేయ, కేశవ లాంటి సినిమాలతో ఒక్కో మెట్టు పైకి ఎదిగిన సిద్ధార్థ్ కార్తికేయ2 తో నేడు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

హైదరాబాద్ కి చెందిన నిఖిల్ సినిమాలపై ఇష్టం తో హీరో అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. సంబరం సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి వచ్చిన నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. అటు పిమ్మట శేఖర్ కమ్ముల తీస్తున్న హ్యాపీ డేస్ సినిమా ఆడిషన్స్ కి వెళ్లి సెలక్ట్ అవగా, అందులో నలుగురి హీరోల్లో ఒకడిగా నటించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాను వదులు కోకుండా అన్ని సినిమాలు చేసాడు. అయితే 2013 లో వచ్చిన “స్వామి రారా” చిత్రంతో మంచి బ్రేక్ అందుకోగా ఆ వెంటనే వచ్చిన “కార్తికేయ” సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రొటీన్ కి భిన్నంగా ప్రత్యేకంగా సినిమాలు చేసే హీరోల్లో ఒకడైన నిఖిల్ తన సినిమాలతో ప్రేక్షకులని మెప్పించడానికి చాలా కష్టపడతాడు. ఈ క్రమంలోనే సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ లాంటి చిత్రాలు చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఇక ఈ మధ్యే విడుదలైన కార్తికేయ2 సినిమాతో నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిపోయాడు. పాన్ ఇండియా మూవీ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి 130కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.

- Advertisement -

ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే గాక ఎదో ప్రత్యేకత కలిగిన చిత్రాలు కావడం విశేషం. ప్రస్తుతం “స్పై” అనే చిత్రంలో నటిస్తున్న నిఖిల్, తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం “ది ఇండియా గేట్” లోను హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈరోజు(జూన్ 1) నిఖిల్ సిద్ధార్థ్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా నిఖిల్ మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని, ఇంకా మరెన్నో పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా గౌరవాన్ని కాపాడేలా ఎదగాలని కోరుకుంటూ filmify టీమ్ తరపున తనకి హృదయపూర్వకంగా బర్త్ డే విషెస్ ని తెలియచేస్తున్నాము.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు