BRO: పవన్ కళ్యాణ్ సినిమాకి పెద్ద స్కెచ్ వేసిన ఏపీ ప్రభుత్వం..?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఓవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో ఈ గ్యాప్ లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ కి, ఏపీ ప్రభుత్వానికి నడుమ పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ చేసే వ్యాఖ్యలు, చేపట్టే కార్యక్రమాలు ఎంతటి చర్చనీయాంశం అవుతాయో అందరికీ తెలిసిందే. పొలిటికల్ హీట్ పెంచడంలో ఆయన రూటే సపరేటు. ఈ క్రమంలోనే పవన్ ని ఇరుకున పడేసేందుకు రాజకీయాల పరంగానే కాకుండా సినిమాలపరంగా కూడా ఆయనను ఇబ్బంది పెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందనేది ఇన్ సైడ్ టాక్.

వకీల్ సాబ్ తో మొదలైన ఈ రచ్చ భీమ్లా నాయక్ వరకు కొనసాగింది. భీమ్లా నాయక్ సినిమా సమయంలో ఏపీ ప్రభుత్వం థియేటర్లకు ముందస్తు నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ సినిమా బెనిఫిట్ షో, అదనపు షోలు వేయరాదని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అదేవిధంగా సినిమా టికెట్ రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలని పేర్కొంది. ఆ సినిమా సమయంలో థియేటర్ల వద్ద ఏకంగా బెటాలియన్ కూడా దిగడం, థియేటర్స్ వద్ద ప్రభుత్వ అధికారులు సినిమా రిలీజ్ సమయంలో పడిగాపులు, అలాగే కొందరు వ్యతిరేకంగా రివ్యూస్ ఇవ్వడం కూడా జరిగింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “బ్రో”. మామ అల్లుళ్లు తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూలైలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే మరోసారి పవన్ సినిమాని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయబోతుందని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఓ షాకింగ్ డిసిషన్ తీసుకుందట. కేవలం 99 రూపాయలకే కొత్త సినిమాని ఇంట్లో రిలీజ్ రోజు, అది కూడా మొదటి షో తోనే చూసేలా ఓ కొత్త ప్లాన్ ని తీసుకురాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా అకస్మాత్తుగా కొత్త డిసిషన్ తీసుకుంటున్నారంటే పవన్ కి సంబంధించిన ఈవెంట్ ఉంటేనే గుర్తుకొస్తాయని అంటున్నారు ఆయన అభిమానులు. ఇలాంటి నిబంధన ఆయన సినిమా సమయంలోనే అమలు చేసి.. ఆ తర్వాత తీసివేస్తారనేది పవన్ అభిమానుల మాట. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు