Bhimaa: బ్రహ్మరాక్షసుడొచ్చేసాడు..!

మ్యాచో స్టార్ గోపీచంద్ కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో “భీమా” సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా జూన్ లో మొదలవగా పోస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక లేటెస్ట్ గా జనవరి 5న భీమా యొక్క అఫిషియల్ టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన కాసేపటికే సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది ఈ టీజర్.

ఈ టీజర్ చూసాక వింటేజ్ గోపీచంద్ ని ఒక్కసారిగా చూసినట్టనిపించింది. టీజర్ లో రవి శంకర్ వాయిస్ ఓవర్ తో భగవద్గీత శ్లోకం చదువుతుంటే పవర్ఫుల్ గా ఒక ఒంగోలు గిత్త పై కూర్చుని సాలిడ్ ఎంట్రీ ఇస్తాడు గోపీచంద్. ముఖ్యంగా టీజర్ చివర్లో రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు వచ్చాడ్రా అంటుండగా, రవి బాసూర్ ఇచ్చిన సాలిడ్ బీజీఎమ్ తో గోపీచంద్ మాస్ అవతార్ లో కనిపిస్తాడు. ఆ ఒక్క సీన్ కే పైసా వసూల్ అన్న ఫీలింగ్ కలిగింది.

- Advertisement -

ఇక భీమా సినిమాలో గోపీచంద్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇంతకు ముందు ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ వంటి సినిమాల్లో పోలీస్ గా నటించాడు. అవి ఏ రేంజ్ హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు తనకచ్చోచ్చిన రోల్ లోనే మళ్ళీ నటిస్తుండడం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు కెజిఎఫ్ ఫేమ్ రవి బాసూర్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక భీమా సినిమాని ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ టీజర్ లో అనౌన్స్ చేసారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు