God Father: సల్మాన్ రెమ్యునరేషన్ ఎంతంటే.!

మెగాస్టార్ చిరంజీవి మలయాళం లో మోహన్ లాల్ హీరోగా నటించిన “లూసిఫర్” రీమేక్ ను తెలుగులో ” గాడ్ ఫాదర్” టైటిల్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించారు. మలయాళం లో పృధ్విరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ చేశారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, చిరంజీవి స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాటలో చిరంజీవితో సల్లు భాయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆడియన్స్ కు కిక్ ఇవ్వడం పక్కా. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ పాత్ర 10 నిమిషాల వరకు ఉంటుందని వినికిడి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

చిరుకి సల్మాన్ అత్యంత సన్నిహితుడు. రామ్ చరణ్ అయితే మరీను. సల్మాన్ నటించిన ” ప్రేమ్ రతన్ ధన్ పాయో” మూవీ తెలుగు వర్షన్ కు సల్మాన్ పాత్రకి డబ్బింగ్ చెప్పింది రామ్ చరణ్ అన్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ఈ చిత్రంలో చేసిన రోల్ కి గాను ఎంత ఛార్జ్ చేశారు అనేదానిపై మెగాస్టార్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలిపారు. దీంతో చిరంజీవి – సల్మాన్ ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత గట్టిదో అర్థమవుతుంది. రాను రాను తమ మధ్య అనుబంధం మరింత బలపడుతూ వస్తుందని అన్నారు చిరంజీవి. కనీసం స్టోరీ కూడా వినకుండా సల్మాన్ ఈ సినిమాకి ఓకే చేశారని అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు