Tollywood : OTTలో స్పెషల్స్ యాంగర్ గేమ్స్ టీజర్ విడుదల

వెంకటేష్ మహ, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ యాంగర్ గమ్స్. నాలుగు కథల ఆంథాలజీగా ఈ సిరీస్ ను రూపొందించారు దర్శకుడు ప్రభల తిలక్. శ్రీధర్ రెడ్డి, సుహాస్ నిర్మించారు. యాంగర్ గేమ్స్ త్వరలో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ ను చుస్తే సస్పెన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందరి పాత్రలు పరిచయం చేయగా, మాటలు లేకుండానే మంచి స్టోరిను చెప్తుంది. టీజర్ లో రంగ, పూజ, రాధ, గిరి పాత్రలను పరిచయం చేశారు. టీజర్ లో ఇతర ప్రధాన పాత్రధారులంతా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించారు. ఈ నాలుగు కథల్లో వారు ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారు అనేది త్వరలో తెలియనుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

- Advertisement -

 

https://youtu.be/8TbKM0c3p9g

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు