Dil Raju: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు రాజ్యసభ ఆఫర్ చేస్తున్నారని ఒక వార్త. లేదు.. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారని మరో వార్త. దిల్ రాజు నిజంగా రాజకీయాల్లోకి వస్తున్నారా? రాజకీయాలపై దిల్ రాజు మనసులో ఏముందో చూద్దాం..

దిల్ రాజు.. సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. సినీ ప్రియుల పల్స్‌ను పసిగట్ట గల దిట్ట. సినిమాల్లో జయాపజయాలు ఎలా ఉన్నా.. దిల్ రాజు ప్రస్తుతం అగ్ర నిర్మాతల్లో ప్రముఖ వ్యక్తి.

దిల్ రాజు సినిమాల్లో డబ్బులు సంపాదిస్తూ.. నిజామాబాద్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన సొంతూరు నర్సింగ్ పల్లిలో ఇందూరు-తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఆలయంలో చిన్న పిల్లలకు, గర్భిణులకు ఆయుర్వేద మందులను కూడా అందిస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తన సోదరుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయాన్ని ప్రయోగాత్మకంగా నర్సింగ్ పల్లిలో చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ‘మా పల్లె’ వెబ్‌సైట్‌ను కూడా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా దిల్ రాజు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. రాజకీయాలు, తదితర అంశాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయంతో రైతులకు అండగా నిలబడడంతో పాటు తన గ్రామంలో విద్య, వైద్య సదుపాయాలను కూడా కల్పించాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే మీరు రాజకీయాల్లోకి వస్తున్నారన్న పుకార్లు బలంగా వినిపిస్తున్నాయని, ఇవన్నీ చేస్తే నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారేమో అనే సందేహాలు వ్యక్తమవుతాయని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వచ్చేది లేదని, ఆ విషయంలో పిచ్చ క్లారిటీతో ఉన్నట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. దిల్ రాజు తన పొలిటికల్ ఎంట్రీపై స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా పుకార్లకు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు