మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరు అగ్ర హీరోలే. ఒకప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోలుగా ఓ వెలుగు వెలిగిన వారే. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ హీరోలు సత్తా చాటుతూనే ఉన్నారు. ఈ తరం స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు. అంతేకాదు వీరి అభిమానుల మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది.
ఇదిలా ఉండగా, ఇటీవల చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘గాడ్ ఫాదర్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఓ పోస్టర్ తో పాటు చిన్నపాటి గ్లింప్స్ లాంటి వీడియోను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అందులో హీరో మోహన్ లాల్.. వైట్ పంచ వైట్ షర్ట్ లో చాలా మాస్ గా కనిపిస్తారు. కానీ ‘గాడ్ ఫాదర్’ లో మాత్రం చిరు బ్లాక్ డ్రెస్ లో కనిపించారు.ఈ లుక్ లో కానీ, చిరు వాక్ లో కానీ ఏమాత్రం మాస్ అప్పీల్ లేదు. పైగా మెగా అభిమానులే ఈ లుక్ పై విమర్శలు గుప్పిస్తుండడం గమనార్హం.
అయితే బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలో కూడా హీరో లుక్ బ్లాక్ డ్రెస్ లోనే ఉంది. అందులో మాత్రం బాలయ్య అదరగొట్టేసారు. దీంతో చిరు లుక్ ను బాలయ్య లుక్ తో పోల్చి విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు. ఈ రెండు సినిమాలో ఒకే సమయంలో రిలీజ్ అవుతాయని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది. విజయదశమికి గాడ్ ఫాదర్ వస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. NBK107 కూడా సంక్రాంతికి ముందే, విజయదశమి పోటీలో ఉంచాలని చూస్తున్నారు.
దీంతో ఇద్దరు అగ్ర హీరోల ఫ్యాన్స్ మధ్య వేడి ఇప్పటి నుండే మొదలైంది. ఈ సినిమా లుక్స్ ను పోల్చుతూ కౌంటర్లు వేసుకుంటున్నారు.