మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వచ్చిన సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ఏదైనా ఉంటే అది గాడ్‌ఫాదర్ అనే చెప్పుకోవాలి. ఖైదీ, సైరా నర్సింహారెడ్డి విజయం సాధించినప్పటికీ గాడ్‌ఫాదర్ హిందీలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తోంది. హిందీలో దాదాపు కొత్తగా 600 థియేటర్లను పెంచడం విశేషం. తాజాగా గాడ్‌ఫాదర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. “నా జీవితంలో అద్భుతమైన 15 సినిమాల్లో గాడ్‌ఫాదర్ ఒకటి. ఇంద్ర, ఠాగూర్ తరువాత ఆ స్థాయి విజయం అంటుంటే ఆనందంగా ఉంది. ఈరోజుల్లో కంటెంట్ బాగుంటేనే సినిమాకి వస్తారని నేనే చెప్పాను. ఈ సినిమాతో ఆ నమ్మకం నిజం అయింది. పారితోషికం కోసం ఎవ్వరం పని చేయలేదు. విజయం ఇవ్వాలని పని చేశాం. మేం సినిమాపై నమ్మకంగా ఉన్నప్పటికీ ప్రచారం గురించి పలు రకాలుగా మీడియాలో కథనాలు వచ్చాయి. మేం ఏం చేయాలో కూడా మీడియానే నిర్దేశిస్తుంటే అది చికాకుగా ఉంటుంది” అన్నారు.
Read More: Prabhas: ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
ముఖ్యంగా గాడ్‌ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వర్షం పడినప్పటికీ తన స్పీచ్ కొనసాగించానని, ఆపితే మీడియా వాళ్లు ఎక్కడ కంపు చేస్తారేమోననే భయంతో ఆ కార్యక్రమానికి బ్రేక్ రాకుండా చూసుకున్నట్టు తెలిపారు చిరంజీవి. దాదాపుగా అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉండవని సల్మాన్‌ఖాన్‌కి పారితోషికం ఇవ్వడానికి వెళ్లితే తిరస్కరించారని చెప్పారు చిరంజీవి. సల్మాన్‌ఖాన్ మంచి మనసున్న వ్యక్తి అని, స
ల్లూ చాలా సరదాగా ఉంటాడు. అదేవిధంగా రామ్ చరణ్ ఏ పని చెప్పినా వెంటనే ఇలా చేసేస్తాడని వివరించాడు. ఈ గాడ్‌ఫాదర్ సక్సెస్ మీట్‌కి చిత్ర బృందం అంతా పాల్గొన్నారు.
Read More: S.S.Rajamouli: 200డేస్ నాట్ ఔట్.. అలా ఆడేస్తుందంతే
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...