Bhola Shankar : సమ్మర్ లోనే..

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తి చేశాడు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటున్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ గా భోళాశంకర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

చెల్లెలి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ స్టోరీ రూపొందుతుంది. కాగా చిరుకు చెల్లెలి పాత్రలో టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.

దర్శకుడు మేహర్ రమేష్ తో చేస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ “భోళా శంకర్” నుంచి ఓ పోస్టర్ తో పాటు మరో ఊహించని అప్డేట్ ను అందించారు మేకర్స్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసేశారు. ఇక ఈ పోస్టర్ లో అయితే మెగాస్టార్ మంచి స్వాగ్ అండ్ స్టైలిష్ గా సూపర్ యంగ్ లుక్స్ లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ తో మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు మెగా ట్రీట్ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు