Ala Vaikunthapurramuloo : తగ్గని ఆదరణ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం “అల వైకుంఠపురములో”. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో సామజవరగమన, రాములో రాములా, పాటలు ఇప్పటికే రికార్డులను సృష్టించాయి.ముఖ్యంగా ఈ చిత్రంలోని “బుట్టబొమ్మ” పాటకి ఇప్పటికీ అదిరిపోయే రెస్పాన్స్ వస్తూనే ఉంది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్, పూజా హెగ్డే స్టైలిష్ లుక్ లో కనిపించారు.

ఈ సాంగ్ లో బన్నీ వేసే స్టెప్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ సాంగ్ కి ఇప్పటికీ రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందంటే.. టాలీవుడ్ నుంచి 800 మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ గా ఈ బుట్ట బొమ్మ నిలిచింది. అంతేకాక 5 మిలియన్స్ కి పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఈ పాట విడుదలైనప్పటినుండి ఆదరణ పెరుగుతూనే ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు