Tollywood: బాలీవుడ్ లో హీరోలు.. టాలీవుడ్ లో మాత్రం విలన్లు

టాలీవుడ్ లో వరుస పాన్ ఇండియా సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీల స్టార్లు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో సూపర్ స్టార్లు కూడా మనవాళ్లతో కలిసి నటిస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో స్క్రీన్ పంచుకున్న విషయం తెలిసిందే.

బాహుబలి, RRR వంటి సినిమాల వల్ల తెలుగు సినిమా స్థాయి పెరిగి దశదిశలా వ్యాపించగా, బాలీవుడ్ వాళ్లకి తెలుగు ఇండస్ట్రీ రేంజ్ తెలిసి టాలీవుడ్ లో నెగిటివ్ రోల్స్ అయినా సరే చేయడానికి వెనకాడట్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ నుండి ఏకంగా అరడజను మంది హీరోలు తెలుగు సినిమాల్లో విలన్లు గా చేస్తున్నారు.

ఆ హీరోలపై ఒక్కసారి లుక్కేస్తే.. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న హరి హర వీరమల్లు లో ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్నాడని చిత్ర యూనిట్ కంఫర్మ్ చేయగా, షూటింగ్ లొకేషన్లో స్టిల్స్ కూడా వైరల్ అయ్యాయి.

- Advertisement -

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో లో వస్తున్న “దేవర” లో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ కూడా జరిపారు. అయితే ఇప్పటికే ఆదిపురుష్ లో ప్రభాస్ తో కలిసి నటించినా అది బాలీవుడ్ సినిమాగా పరిగణిస్తారు.

ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సుజీత్ తో తీస్తున్న “ఓజి” నుండి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడంటూ సినిమా యూనిట్ సభ్యులు ప్రకటించారు. అయితే ఈ సినిమా రావడానికి సంవత్సరం టైం పడుతుంది. ఇవేగాక వెంకటేష్ నటిస్తున్న “సైంధవ్” లో విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తుండగా, బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి లో అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడని టీజర్ తో కంఫర్మ్ అయిపోయింది. మరి రాబోతున్న సినిమాల్లో ఇంకెంత మంది బాలీవుడ్ స్టార్లు తెలుగులో నటించబోతున్నారో అనేది ఆసక్తిగా మారింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు