Venuswamy: వేణు స్వామి చెంతకు చేరిన అషు రెడ్డి.. కారణం..?

Venuswamy

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి.. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల జాతకాలు, రాజకీయ నాయకుల జాతకాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా వేణు స్వామి చెప్పినవన్నీ జరుగుతున్న నేపథ్యంలో జనాలు ఎక్కువగా ఈయనని నమ్ముతున్నారు.. ఇటీవలే ఉపాసన , రాంచరణ్ దంపతులకు క్లీంకార పుట్టగా.. ఆ పాప పుట్టిన తేదీ సమయాన్ని బట్టి కూడా జాతకం చెప్పేశారు. రామ్ చరణ్ కూతురు జాతకం తో ఆ కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుందంటూ వేణు స్వామి తెలియజేశారు. మరి వేణు స్వామి చెప్పినట్టు గానే చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు లభించి వారి గుర్తింపు దేశవ్యాప్తంగా పాకిపోయింది.

అలాగే గతంలో ఒక హీరో చనిపోతారని కూడా తెలిపారు. అలాగే తారకరత్న కూడా మరణించారు. సమంత , నాగచైతన్య విడిపోతారని చెప్పడంతో ఆ విషయం కూడా జరగడంతో.. ప్రతి ఒక్కరు కూడా ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక కూడా తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ చేసుకుని వేణు స్వామి తో పూజలు చేయించుకొని మరి స్టార్ హీరోయిన్గా మారిందని వేణు స్వామి ఎన్నో సందర్భాలలో తెలిపారు.

దీంతో రష్మిక బాటలోనే చాలామంది హీరోయిన్స్ కూడా వేణు స్వామితో పూజలు చేయించుకొని తమ భవిష్యత్తును మార్చుకున్నారు. అలా హీరోయిన్ నిధి అగర్వాల్, డింపుల్ హయాతి తదితర హీరోయిన్స్ కూడా వేణు స్వామి దగ్గర పూజలు చేయించుకున్నారు. ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ హాట్ బ్యూటీ గా పేరు పొందిన ఆర్జీవి బ్యూటీ అషు రెడ్డి కూడా వేణు స్వామి తో రహస్య పూజలు చేయించుకుంది. అందుకు సంబంధించి ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది.

- Advertisement -

Big boss fame Ashu Reddy performed secret poojas with Venu Swamy

అషు రెడ్డి కెరియర్ అంత బాగాలేదని ఆమెకు ఆఫర్స్ వస్తున్నా సక్సెస్ అందుకోవడం లేదని.. మంచి సినిమా అవకాశాలు రాలేదని.. ఇలా వేణు స్వామితో పూజలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది.అందుకే మళ్లీ తన లైఫ్ బాగుండాలని అషు రెడ్డి ఇలా పూజలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను వీడియోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. మరి వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకుంటున్న అషు రెడ్డి మిగతా హీరోయిన్ల లాగా సక్సెస్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు