Common man to celebrity : సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అయిన సామాన్యులు వీళ్లే..!

Common man to celebrity

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యులు కూడా సెలబ్రిటీలు అయిపోతున్నారనటంలో సందేహం లేదు.. తమ మాట తీరుతో , పనితనంతో భారీ పాపులారిటీ దక్కించుకొని సెలబ్రిటీల రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం .మరి ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అయిపోయిన సామాన్యులు ఎవరో ఇప్పుడు చూద్దాం..

గంగవ్వ:
మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న గంగవ్వ.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని మరింత మంచి పేరును దక్కించుకుంది. ఈ షో తర్వాత పలు సినిమాలకు ప్రమోషన్స్ కూడా చేసిన ఈమె.. ఇప్పటికీ ప్రేక్షకులలో భారీగా క్రేజ్ దక్కించుకుందని చెప్పవచ్చు. అంతేకాదు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సంపాదించుకున్న క్రేజ్ తో సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటుంది గంగవ్వ.

బర్రెలక్క శిరీష:
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో బర్రెలక్క శిరీష కూడా ఒకరు.. ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు.. ఎంపీ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తానని చెప్పారు. అంతేకాదు ఈమె ప్రతిభను మెచ్చి ఈమెకు రూ.15 లక్షలు విరాళాలు కూడా ఇచ్చారని తెలుస్తోంది.

- Advertisement -

పల్లవి ప్రశాంత్:
రైతుబిడ్డ అనే ట్యాగ్ తో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి భారీ పాపులారిటీ దక్కించుకున్న పల్లవి ప్రశాంత్.. ఇదే పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచారు. అంతేకాదు ఇప్పుడు స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న పలు షోలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు పల్లవి ప్రశాంత్.

కుమారి ఆంటీ:
ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ భారీ పాపులారిటీ దక్కించుకున్న కుమారి ఆంటీ సోషల్ మీడియాలో..” మీది మొత్తం థౌసండ్ అయింది.. రెండు లివర్లు ఎక్స్ట్రా” అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ దక్కించుకుంది.. స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఉత్సవం సోలో కూడా పాల్గొనింది కుమారి ఆంటీ.. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇకపోతే కుమారి ఆంటీ ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ కూడా వైరల్ అయ్యాయి.

కుర్చీ తాత:
ఇటీవల గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే పాట వచ్చిన విషయం తెలిసిందే. అయితే కుర్చీ మడత పెట్టి అనే కామెంట్లతో కూర్చి తాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ తర్వాత ఈ తాతకు మరింత క్రేజ్ పెరిగింది..

ఇలా వీరంతా కూడా సోషల్ మీడియా ద్వారానే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు