Bhola Shankar Trailer: “మాకు మేమే.. మీకు మీరే” మెగా ఫ్యామిలీ కొత్త నినాదం

Bhola Shankar Trailer

చిన్న హీరోలను ఎంకరైజ్ చేయాలి. పక్క హీరోలు అంటే, వారి సినిమాలంటే కూడా ఇష్టం. ఇండస్ట్రీలో అందరూ హీరోలు సమానమే. తెలుగు ఇండస్ట్రీ ఏ ఒక్క కుటుంబానికి కూడా సొంతం కాదు. తెలుగు హీరోలు ప్రపంచ వేధికపై సత్తా చాటుతున్నారంటే అది టాలీవుడ్ పరిశ్రమకే గర్వకారణం. ఈ డైలాగ్స్ అన్నీ గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీలోని స్టార్ హీరోల నుంచి వస్తున్నాయి. సందర్భాన్ని బట్టీ మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్స్ ను ఎదేచ్చగా వాడేస్తున్నారు.

ఇండస్ట్రీకి పెద్దన్న అని నిరూపించడానికి చిరు, తన పొలిటికల్ కెరీర్ కోసం, వచ్చే ఎన్నికల్లో అందరు హీరోల ఫ్యాన్స్ ఓట్లను దక్కించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్స్ చెబుతున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇది విమర్శలు అనుకుంటే, ఇటీవల మెగా ఫ్యామిలీలోని హీరోలు చేస్తున్న దాన్ని చూస్తే, ఈ విమర్శలు నిజమేమో అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే, మంగళవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన BRO మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. నిజానికి ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఓ వైపు వర్షం ఉన్నా.. పవర్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున ఈవెంట్ కు హజరై సక్సెస్ చేశారు.

- Advertisement -

అయితే ఈవెంట్ కు ముఖ్య అతిథులు ఎవరు వస్తారో అనే చిన్న డౌట్ ఉండేది. కానీ, ఈవెంట్ కు కొన్ని గంటల ముందు, BRO ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక అంటూ అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ కారణాల వల్ల నిహారిక ఈవెంట్ కు రాలేదు. అయితే ఇక్కడ పవర్ స్టార్ సినిమాకు గెస్ట్ లుగా వచ్చే సీన్ వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లకు లేదని చెప్పొచ్చు. కానీ, ఈ యంగ్ హీరోలు ఎందుకు వచ్చారంటే, ఎవరైన చెప్పేది ఒక్కటే.. వాళ్లు మెగా కంపౌండ్ నుంచి వచ్చారు కాబట్టి.

ఇది పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్. ఈ మూవీ ఆగస్టు 11న థియేటర్ లోకి రానుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్ అప్డేట్ కాసేపటి క్రితం వచ్చింది. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

అయితే ఎప్పుడు యంగ్ హీరోల గురించి, నాన్ మెగా హీరోల గురించి మాట్లాడే మెగాస్టార్, పవర్ స్టార్.. తమ సినిమాల విషయానికి వచ్చే సరికి మెగా కంపౌండ్ లోని హీరోలను మాత్రమే గెస్ట్ లుగా పిలుస్తున్నారు. ఇతర హీరోలపై అంత గౌరవం ఉంటే, తమ సినిమాలకు కష్టపడుతూ ఎదిగిన వాళ్లును గెస్ట్ లుగా పిలవచ్చు కదా.. అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మెగా హీరోలు బయటికి మాత్రమే ఇండస్ట్రీ అంతా ఒకటి అనే డైలాగ్స్ కొడుతున్నారు. కానీ, వాస్తవ రూపానికి వస్తే మాత్రం.. “మాకు మేమే.. మీకు మీరే” అనే నినాదాన్నే పాటిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు