Sai Dharam Tej: సినిమాలు మానేసి షార్ట్ ఫిలిమ్ చేస్తున్న మెగా హీరో..!

Sai Dharam Tej

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) సినిమాలు మానేసి 6నెలల గ్యాప్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తేజ్ ఒక షార్ట్ ఫిలిమ్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. సోషల్ అవేర్నెస్ కోసం నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ డైరెక్షన్లో 23నిమిషాల షార్ట్ ఫిలిం చేస్తున్నాడట. ఇటీవలే యాక్సిడెంట్ నుండి కోలుకున్న తేజ్ తన ప్రతి స్పీచ్ లో హెల్మెట్ ఇంపార్టెన్స్ గురించి, ప్రాణం విలువ గురించి ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ కి జాగ్రత్తలు చెప్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత తేజ్ ధోరణిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.గతంలో కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ మీద అవేర్నెస్ కోసం ఒక షార్ట్ వీడియో చేసాడు తేజ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు తేజ్ చేయబోయే షార్ట్ ఫిలిమ్ కూడా రోడ్ సేఫ్టీ కాన్సెప్ట్ మీదనే ఉండచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.

బ్రో సినిమా రిలీజ్ తర్వాత 6నెలల పాటు ఫిజికల్ ఫిట్నెస్ థెరపీ కోసం యూఎస్ వెళ్లనున్న తేజ్ త్వరలోనే ఈ షార్ట్ ఫిలిమ్ రిలీజ్ చేయనున్నాడని తెలుస్తోంది. యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత విరూపాక్ష సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తేజ్ బ్రో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

జులై 28న విడుదలకి సిద్ధంగా ఉన్న బ్రో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి గ్లిమ్ప్స్ తర్వాత రిలీజ్ అయిన రెండు పాటలు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో కాస్త నిరాశకు గురైన మెగా ఫ్యాన్స్ కి ట్రైలర్ మంచి కిక్ ఇచ్చింది. ప్రీరిలీజ్ సందర్భంగా రిలీజ్ అయిన థీమ్ సాంగ్ కి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మరి, మామా అల్లుళ్ళు తొలిసారి కలిసి నటించిన బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు