VD12 Heroine : రౌడీకి హీరోయిన్‌ సెర్చింగ్… తెలుగు వాళ్లకు ఇదే పని

Mamitha Baiju in VD 12 : గాసిప్స్ క్రియేట్ చేయడంలో, దాన్ని స్ప్రెడ్ చేయడంలో ఓ పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ మన తెలుగు వాళ్లకే వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో అయితే ఆ ఉత్సహామే వేరు. సడన్‌గా ఈ టాపిక్ ఎందుకంటే…

గత కొన్ని రోజుల నుంచి విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న VD12 మూవీలో హీరోయిన్ గురించి నెట్టింట్లో తెగ చర్చ సాగుతుంది. మూవీ టీం నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాకముందే, గాసిప్ రాయుళ్ల తమకు తాము పని కల్పించుకుని వరస పెట్టి గాసిప్స్ ను బయటికి వదులుతున్నారు. అలా ఈ VD12 మూవీకి ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్స్ ను తీసుకొచ్చారు ఆ గాసిప్ రాయుళ్లు.

ఇప్పుడు వస్తున్న గాసిప్…

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా శ్రీలీల తప్పుకున్న తర్వాత నాటి నుంచి హీరోయిన్ విషయంలో ఎప్పుడు ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో రౌడీ హీరోకు జోడీగా భాగ్యశ్రీ బోర్సెను తీసుకున్నారని, దీనిపై త్వరలోనే అనౌన్స్‌మెంట్ రాబోతుందని ఓ గాసిప్ వచ్చింది. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన భాగ్యశ్రీ బోర్సె “యారియన్ 2”తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హరీష్ శంకర్ – రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న “మిస్టర్ బచ్చన్” మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదే టైంలో VD12 లో కూడా ఈమె ఫిక్స్ అయిందని ఇటీవల టాక్ వచ్చింది. నిజానికి VD12 టీం ఇప్పటి వరకు భాగ్యశ్రీ బోర్సె ను పరిశీలించలేదట.

- Advertisement -

Read More :  VD12 : ఆ ఇద్దరు క్రేజీ హీరోయిన్లపై దేవరకొండ కన్ను… ఛాన్స్ ఇస్తారా?

గతంలో త్రిప్తి పేరు…

కొన్ని రోజుల క్రితం ఎక్కడ చూసిన త్రిప్తి దిమ్రి పేరు మార్మోగింది. యానిమల్ మూవీలో కొంత వరకే కనిపించినా, ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ క్రేజ్‌తోనే అనేక అవకాశాలూ వచ్చాయి. ఈ క్రమంలోనే VD12 నుంచి శ్రీలీల తప్పుకున్న తర్వాత మీనాక్షి చౌదరి వచ్చిందని, ఆమె కూడా తప్పుకోవడంతో త్రిప్తిని ఫైనల్ చేశారంటూ గాసిప్ తెగ చక్కర్లు కొట్టింది.

Read More : VD 12 : విజయ్ దేవరకొండతో “యానిమల్” బ్యూటీ…

ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరంటే…?

ఈ మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్న తర్వాత మూవీ టీం మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అయితే మీనాక్షి చౌదరి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, VD12 ని నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో మూవీని నిర్మిస్తుంది. అదే లక్కీ భాస్కర్. అందులో మీనాక్షి హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ వల్ల VD12కి డేట్స్ ఇవ్వడం కష్టంగా ఉందట. పైగా ఈ మూవీ పాన్ ఇండియా వైడ్‌గా రాబోతుంది. దాదాపు ఏడాది పాటు డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే VD12 నుంచి మీనాక్షి చౌదరి తప్పుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే కొత్త హీరోయిన్ కోసం సెర్చింగ్ జరుగుతుంది. ఇప్పుడు మూవీ టీం కంట మమిత బైజు పడింది.

Read More : VD12 : హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఫిక్స్…

మమితా బైజు ఎంపిక ఆలస్యానికి కారణం ఇదేనా…?

మిమితా బైజు… 2017లో మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మమితా బైజు.. ఈ మధ్య కాలంలో సౌత్ లో సెన్సెషన్ గా మారిపోయింది. దీనికి కారణం… ఇటీవల రిలీజ్ అయిన ప్రేమలు మూవీ అనే చెప్పుకొవచ్చు. ఈ సినిమా తర్వాతే తెలుగు దర్శక నిర్మాతల కంట పడిందీ బ్యూటీ. అందుకే VD12 మూవీ టీం కూడా మమితా బైజును తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమయ్యాయట. కానీ, సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో మమితా ఆలోచిస్తుందని సమాచారం.

ఇప్పటి వరకు అయితే VD12 మూవీ టీం అయితే హీరోయిన్ పాత్ర కోసం కేవలం మమితా బైజునే సంప్రదించారని Filmify కి వచ్చిన సమాచారం. అంతే కాదు, ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు మమితా బైజు కన్ఫామ్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువే ఉన్నాయట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు