Maa Bava Manobhavalu : మాస్ బీట్ తో..

నందమూరి హీరో బాలకృష్ణ రోజు రోజుకు యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ మాస్ డైలాగ్స్, మాస్ స్టెప్స్ తో రఫ్ ఆడిస్తున్నాడు. బాలయ్య తాజాగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి విధితమే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన అన్ని అప్ డేట్స్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. “జై బాలయ్య..” , “సుగుణ సుందరి..” సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో మాస్ సాంగ్ వచ్చింది. “మా బావ మనోభావాలు…” అంటూ హుషారెత్తే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ పాటలో బాలయ్య వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. మాస్ బీట్ కు సరిపోయే విధంగా బాలయ్య అదిరిపోయే డ్యాన్స్ తో పిచ్చెక్కించారు. అలాగే రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, తమన్ మ్యూజిక్ నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ మాస్ సాంగ్ విడుదలైన కొన్ని నిమిసాల్లో ట్రెండింగ్ లోకి రావడంతో పాటు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ పాటతో వీర సింహారెడ్డి పై అంచనాలు మరింత పెరిగాయి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు