Captain Trailer : ఏలియన్స్ నేపథ్యంలో..

ఆర్మీ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. హీరో పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించడం శత్రు దేశాలపై ఊహకు అందని విధంగా దాడులు చేయడం చివరికి విజయం సాధించడం అనేది చాలా సినిమాల్లో చూశాం. కొన్ని సినిమాల్లో తీవ్రవాదుల చేతిలో హీరో చనిపోతాడు. మధ్యలో కొన్ని విభిన్న అంశాలను చూపించినా, చివరికి జరిగేది మాత్రం ఇదే. అయితే కోలీవుడ్ నటుడు ఆర్య కూడా తాజాగా ఆర్మీ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నాడు. కెప్టెన్ అనే టైటిల్ తో శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో ఆర్యకు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కెప్టెన్ సినిమా సెప్టెంబర్ 8న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ప్రమోషన్ లో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ చూస్తే, ఆర్మీ నేపథ్యంలోనే వచ్చే విభిన్న కథ అని అర్థమవుతుంది. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ ఈ సినిమాలో ఏలియన్స్ ను చూపించినట్టు తెలుస్తుంది. అలాగే ఒక భయంకరమైన ఫారెస్ట్ లో మూవీ ఉంటుందని అర్థమవుతుంది. ట్రైలర్.. “శత్రువు ఎవరు అయినప్పటికీ.. ఎటాక్ చేయడానికి ఆర్మీ వాళ్లకు నాలుగు స్టేజెస్ ఉంటాయి. శత్రువును కనిపెట్టడం. శత్రువు బలహీనత తెలుసుకోవడం. శత్రువును మాయ చేయడం. ది ఫైట్” అంటూ హీరో ఆర్య చెబుతున్న డైలాగ్ తో ప్రారంభమవుతుంది.

ఈ డైలాగ్ తో హీరో ఒక లాజికల్ గా ఆలోచించే ఆర్మీ ఆఫీసర్ అని తెలుస్తుంది. అలాగే మధ్యలో అమెరికాలో ఉన్న ఏరియా 51 ను ఆధారంగా ఒక ఫారెస్ట్ ను ఈ సినిమాలో తీసుకున్నట్టు తెలుస్తుంది. “ఇది సెక్టర్ 42.. 50 ఏళ్లుగా ఎలాంటి మిలిటరీ ఆక్టివిటీ లేదు. సివిలియన్ ఆక్టివిటీ లేదు. పంపించిన వాళ్లలలో ఎవరూ తిరిగిరాలేదు. ఎప్పుడు చూడని ఒక బయోలాజికల్ ఫీచర్ ఈ ఫారెస్ట్ లో ఉంది” అని వచ్చే డైలాగ్ తో ఆ మిస్టరీ ఫారెస్ట్ గురించి తెలుస్తుంది. ఈ ఫారెస్ట్ లో జరుగుతున్న దాని గురించి హీరో టీం వెళ్తుందని, అక్కడ సమస్యను ఛేదించడానికి ఫైట్ చేస్తారని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు