NTR : ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించిన కళాతపస్వి కె.విశ్వనాథ్..!

తెలుగు సినీపరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఒకరు. ఆయన సినిమాల్లో నటీనటుల నటన అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన సినిమాల్లోని పాత్రలు మనకి వెంటనే కనెక్ట్ అవుతాయి. మనతో ట్రావెల్ అవుతాయి కూడా. అంత సహజంగా తెలుగుతనం ఉట్టిపడేలా సినిమాని తీర్చిదిద్దుతారు కే.విశ్వనాథ్ గారు.అంత గొప్ప దర్శకుడికి ఓ హీరో నటన నచ్చింది అంటే అది ఏ స్థాయిలో ఉంటుంది. ఇంతకీ ఆయనకి ఏ హీరో నటన నచ్చింది. హెడ్డింగ్ చూసిన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలా?
ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ నటన ఈయనకి బాగా నచ్చిందట. కొమరం భీమ్ పాత్రకి ఎన్టీఆర్ ప్రాణం పోశాడు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటించారు అని విశ్వనాథ్ గారు తెలిపారు. సినిమా చూసిన వెంటనే ఎన్టీఆర్ కు ఈయన ఫోన్ చేసి మరీ అభినందించారట. అల్లరి రాముడు సినిమాలో ఎన్టీఆర్ – విశ్వనాథ్ గారు తాతమనవళ్లుగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు