Aparna Balamurali : కామెంట్స్ చూసి బాధ‌ప‌డ్డాను

త‌మిళ స్టార్ హీరో సూర్య ప్ర‌ధాన న‌టించిన సురారై పొట్టు సినిమాతో ప‌రిచ‌య‌మైంది అప‌ర్ణ బాల ముర‌ళి. ఈ సినిమా తెలుగులో ఆకాశ‌మే నీ హ‌ద్దురా పేరుతో విడుద‌ల అయింది. త‌న తొలి సినిమాతోనే న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు అందుకుంది. సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో అచ్చం తెలుగింటి అమ్మాయిగా క‌నిపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర అయ్యారు. ముఖ్యంగా ఆమె పాత్ర‌కు సౌత్ ఇండియ‌న్స్ ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డునే అందుకుంది అప‌ర్ణ‌. ఈ చిత్రం త‌రువాత దీతుమ్ న‌న్నుమ్‌, వీట్ల విసెన‌వం వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో 6, త‌మిళంలో నిత్యం ఆరు దానం వంటి చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇటీవ‌లే ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా నిత్యం ఆరుదానం చిత్ర బృందం అప‌ర్ణ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. తాజాగా త‌న‌పై వ‌స్తున్న ట్రోలింగ్‌.. బాడీ షేమింగ్ పై అపర్ణ స్పందించింది.

ముఖ్యంగా ఒక వ్య‌క్తి బ‌రువు పెర‌గ‌డానికి శ‌రీరంలోని అనేక స‌మ‌స్య‌లు కార‌ణం అవుతాయి. నేను బొద్దుగా ఉన్నాను. అదే లుక్‌తో సినిమాల్లో న‌టించ‌మ‌ని అడిగే వాళ్లు చాలా మంది ఉన్నారు. నా శ‌రీర ఆకారంపై వ‌స్తున్న కామెంట్స్ చూసి తొలుత చాలా బాధ‌ప‌డ్డాను. లావుగా ఉన్నావ‌ని అమ్మ‌పాత్ర‌లో న‌టిస్తావా అని అడుగుతున్నారు. నా వ‌య‌సు అమ్మ పాత్ర‌లు న‌టించేంత కాదు. కొంద‌రూ స‌న్న‌గా ఉంటేనే హీరోయిన్లుగా భావిస్తున్నారు. స‌న్నగా ఉంటేనే హీరోయిన్‌గా ఛాన్స్ ల‌భిస్తుంద‌న్న విష‌యం ఏంట‌నేది అస్స‌లు అర్థం కావ‌డం లేద‌ని చెప్పుకొచ్చింది.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు